Telangana24th Sep 04:16 PMSunil Byrisetty1 min read
వండక్కర్లేని మాయా బియ్యం తెలుసా!
స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు. పొయ్యి మీద వండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యాన్ని కేవలం నీళ్లలో వేసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు. అన్నం రెడీ. ఇటువంటి మాయ బియ్యం గురించి మీరు ఎప్పు
స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు. పొయ్యి మీద వండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యాన్ని కేవలం నీళ్లలో వేసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు. అన్నం రెడీ. ఇటువంటి మాయ బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ బియ్యం పేరు బొకాసాలు. ఈ బియ్యాన్ని అసోం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. సైనికులు కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి బియ్యం మాకు కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లా శ్రీరాములు పల్లికి చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అసోంతో పాటు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఈ ధాన్యం గురించి తెలుసుకున్నాడు. అతడు ఇప్పుడు తన ఊరిలో ఈ ధాన్యాన్ని సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అనేకమంది రైతులు అతని దగ్గరకు వెళ్లి, ఈ బొకాసాలు అనేటువంటి వరి ధాన్యం విత్తనాలు తెచ్చుకుంటున్నారు.