Politics14th May 10:36 AMSunil Byrisetty1 min read

కొడాలి నాని పెత్తనంతో వైసీపీలో పడిన మరో వికెట్!

మాజీమంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. కొడాలి నాని వైఖరితో విసి

కొడాలి నాని పెత్తనంతో వైసీపీలో పడిన మరో వికెట్!
మాజీమంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. కొడాలి నాని వైఖరితో విసిగిపోయామని ప్రకటించారు. నానిని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో వరదలు ముంచెత్తినప్పుడు కనీసం బాధితులను పరామర్శించేందుకు కొడాలి నాని రాలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత మొత్తం పార్టీని గాలికి వదిలేశారని కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీనే నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను నాని పట్టించుకోలేదని , కనీసం వరదల్లో సర్వం కోల్పోతే పరామర్శకు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదన్నారు. నాని వైఖరితో వైసీపీకి కీలక నాయకుడు దూరమయ్యారు.
AP Politics
Ysrcp
Kodali Nani
Mahammad Khasim Babu
మాజీమంత్రి కొడాలి నాని
నానిని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం
Scroll for the next article