News28th Jan 12:12 PMSunil Byrisetty1 min read
విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం దుర్మరణం
నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించిన అజిత్ పవార్. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. మహారాష్ట్రలో
నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించిన అజిత్ పవార్. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.