News8th Oct 04:24 PMSunil Byrisetty1 min read

మంత్రి బీసీ జనార్దన్ తో మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే భేటీ

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై ఇరువురు మంత్రులు విస్తృత చర్చ జరిపారు. గ్

మంత్రి బీసీ జనార్దన్ తో మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే భేటీ
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై ఇరువురు మంత్రులు విస్తృత చర్చ జరిపారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, PPP విధానం, నూతన మారిటైమ్ పాలసీపై మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి ఏపీ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలోనే ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్‌లో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధిపై మంత్రి నితేష్ రాణే ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ సంస్థలకు ఆపరేషన్లు అప్పగించే ఏపీ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని నితేష్ రాణే కొనియాడారు. ఒక్కో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సుమారు రూ.4,500 కోట్ల పెట్టుబడితో 2027 నాటికి పోర్టుల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వివరించారు.
Scroll for the next article