Politics10th Apr 12:19 PMSunil Byrisetty1 min read
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధి
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) నిర్వహించారు.
ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు.
కర్నూలు మేయర్ పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధత నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది