Politics16th Jan 05:27 PMSunil Byrisetty1 min read
ముంబై కార్పొరేషన్ 'మహాయుతి' కూటమిదే
మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతుంది. బీజేపీ-శివసేన కూటమి 119 స్థానాల్లో.. థాక్రే కూటమి 70 స
మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతుంది. బీజేపీ-శివసేన కూటమి 119 స్థానాల్లో.. థాక్రే కూటమి 70 స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తానికి ముంబై మేయర్ పీఠాన్ని మహాయతి కూటమి సొంతం చేసుకోబోతుంది. ముంబైతో పాటు 29 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుంది. ముంబైలో మొత్తం 227 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం కూటమి మెజార్టీ మార్కు దాటేసింది. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.