News17th Jun 04:17 PMSunil Byrisetty1 min read
ఏలూరు ఎస్పీ కార్యాలయానికి బొలెరో విరాళం!
ఏలూరు ఎస్పీ కార్యాలయానికి మహేంద్ర బొలెరో వాహనాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విరాళంగా ఇచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫ
ఏలూరు ఎస్పీ కార్యాలయానికి మహేంద్ర బొలెరో వాహనాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విరాళంగా ఇచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌లో భాగంగా ఈ విరాళాన్ని అందజేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల మండలంలో లా అండ్ ఆర్డర్ విధులకు ఉపయోగించేందుకు రూ. 12 లక్షల విలువ గల మహేంద్ర బొలెరో వాహనాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విరాళంగా అందించినట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వాహనాన్ని శాంతి భద్రతల విభాగంలో వినియోగించనున్నారు.