Spiritual1st Oct 09:17 AMSunil Byrisetty1 min read

శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం

నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసుర

శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం
నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందాడు. దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురి చేస్తూ లోకాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహ వాహనంతో విరాజిల్లుతూ, అష్టదశ భుజాలతో ఆయుధాలను ధరించి, ఆమె మహిషాసురుని వధించి ధర్మాన్ని స్థాపించారు. దేవాలయాల్లో ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శించడం గొప్ప అనుభూతి. ఈ రూపం భక్తులకు దుశ్శక్తులపై పోరాడే ధైర్యాన్ని, సత్ప్రవర్తనలో నిలకడను ప్రసాదిస్తుందని నమ్మకం.
Navratri
Durga Puja
Mahishasura Mardini
Vijayawada Kanaka Durga
Hindu Mythology
Devi Alankaram
Shakti Worship
శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం
విజయవాడ కనకదుర్గ
శక్తి ఆరాధన
Scroll for the next article