News26th Nov 05:59 PMSunil Byrisetty1 min read
కలెక్టరేట్ ముందు మొక్కజొన్న విత్తన రైతుల ధర్నా
మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుంచి రైతులకు పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం- ఆంధ్రప్రదేశ్ విత్తన రైత
మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుంచి రైతులకు పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం- ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం జిల్లా కమిటీల ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకాతిరుమల మండలంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని వారికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2025 విత్తన చట్టం ముసాయిదా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేదిగా ఉందన్నారు. రైతులకు అనుకూలమైన విత్తన చట్టం తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విత్తన మొక్కజొన్న పంట సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కంపెనీల నుంచి రైతులకు అగ్రిమెంట్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.