Telangana9th Dec 12:12 PMSunil Byrisetty1 min read

తెలంగాణ సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మ

తెలంగాణ సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది.
Telangana
CM Revanth Reddy
Convoy Incident
ORR Hyderabad
Jammer Vehicle
Tyre Burst
Major Accident Averted
ప్రమాదం తప్పింది
ట్రాఫిక్ పోలీసులు
భద్రత
హైదరాబాద్
Scroll for the next article