News12th Sep 12:12 PMSunil Byrisetty1 min read

వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మి

వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.249.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 10 క్రిటికల్ కేర్ బ్లాక్స్, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయవాడలోని పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ వేదిక నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సిద్ధంగా ఉన్న మిగిలిన 9 క్రిటికల్ కేర్ బ్లాక్స్, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
Andhra Pradesh Healthcare
PM Ayushman Bharat Health Infrastructure Mission
PM ABHIM
Critical Care Blocks
Integrated Public Health Laboratories
JP Nadda
పెమ్మసాని చంద్రశేఖర్
సత్యకుమార్ యాదవ్
విజయవాడ
ప్రజారోగ్య మౌలిక వసతులు
వైద్య రంగ అభివృద్ధి
Scroll for the next article