News20th Jan 05:10 PMSunil Byrisetty1 min read

రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు

రైల్వే రిజర్వేషన్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో తిరిగి మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువ అని తెలిసిందే. అయితే ఇక నుంచి ఆ బాధ ఉండదు. రిజర

రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు
రైల్వే రిజర్వేషన్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో తిరిగి మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువ అని తెలిసిందే. అయితే ఇక నుంచి ఆ బాధ ఉండదు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పటికి దాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఖాళీలను బట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రిజర్వేషన్ చేసుకున్న రైలు కాకుండా వేరే రైలుకు కావాలన్నా ఆ రైలుకు కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల క్యాన్సిలేషన్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. ఈ సౌకర్యం ఇప్పటివరకు రైల్వేలో లేదు. దేశంలో మొదటిసారిగా రైల్వే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సౌకర్యాన్ని ఎక్కడి నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు.
Indian Railways
Railway Reservation
Major Changes
Ticket Cancellation
Rebooking Facility
Reservation Transfer
Passenger Convenience
Railway Reforms
Scroll for the next article