News21st Oct 04:24 PMSunil Byrisetty1 min read

రేషన్ పంపిణీలో భారీ మార్పులు!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో భారీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న బియ్యంతోపాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క

రేషన్ పంపిణీలో భారీ మార్పులు!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో భారీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న బియ్యంతోపాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అలాగే రాబోయే రోజుల్లో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు షాపులు అందుబాటులో ఉండనున్నాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు. ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
Andhra Pradesh
Ration Distribution
Civil Supplies
Nadendla Manohar
Public Distribution System
Mini Malls
Millet Supply
రేషన్ పంపిణీ
ప్రభుత్వ సంస్కరణలు
సంక్షేమ పథకాలు
పోర్టబిలిటీ సదుపాయం
Scroll for the next article