International12th Dec 12:07 PMSunil Byrisetty1 min read

భారీ చోరీ.. బ్రిటన్ మ్యూజియంలో మాయమైన భారతీయ కళాఖండాలు!

బ్రిస్టల్ నగరంలో భారీ చోరీ జరిగింది. బ్రిటన్‌లోని మ్యూజియంలో దుండగులు 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు. బ్రిటిష్ కాలంనాటి భారతీయ కళాఖండాలు కూడా వాటిలో ఉన్నాయి. బ్రిస

భారీ చోరీ.. బ్రిటన్ మ్యూజియంలో మాయమైన భారతీయ కళాఖండాలు!
బ్రిస్టల్ నగరంలో భారీ చోరీ జరిగింది. బ్రిటన్‌లోని మ్యూజియంలో దుండగులు 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు. బ్రిటిష్ కాలంనాటి భారతీయ కళాఖండాలు కూడా వాటిలో ఉన్నాయి. బ్రిస్టల్‌లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో అర్ధరాత్రి జరిగిన దోపిడీలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి చెందిన నడుము పట్టీ బకిల్, దంతంతో చేసిన బుద్ధుడి విగ్రహం వంటి అమూల్యమైన భారతీయ వస్తువులు ఉన్నాయి. ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమర్‌సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు అనుమానితులు ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ మాట్లాడుతూ, "సాంస్కృతికంగా ఎంతో విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి తీరని నష్టం. వీటిలో చాలా వరకు విరాళంగా వచ్చినవే. నిందితులను పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నాం" అని తెలిపారు. ఘటన జరిగి రెండు నెలలు దాటిన తర్వాత పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం.
Bristol Theft
British Museum Heist
Indian Artifacts
Cultural Heritage
East India Company
Buddha Statue
British Empire & Commonwealth Museum
UK Crime
CCTV Suspects
International News
Scroll for the next article