News8th Sep 04:20 PMSunil Byrisetty1 min read
భారీగా ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలోనూ సింఘాల్ టీటీడీ ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బదిలీ అయ్యారు.