News13th Aug 11:36 AMSunil Byrisetty1 min read
రాజధాని నిర్మాణంలో ఆవిష్కృతమైన కీలక ఘట్టం!
రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో దశను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.1,519 కోట్ల వ్యయంతో 21.77 కి.మీ రహదారి నిర్మాణం పూర్తి చేశారు. 60
రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో దశను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.1,519 కోట్ల వ్యయంతో 21.77 కి.మీ రహదారి నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల వెడల్పుతో మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్ లో 9 లైన్ల రహదారి నిర్మించారు. ఇ -3 విజయవాడ - మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్ హామ్ కెనాల్ పై 478 మీ. పొడవున స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. రూ.82 కోట్లతో బకింగ్ హామ్ కెనాల్ పై నాలుగు వరుస స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు.సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన తొమ్మిది టవర్లలోని 216 క్వార్టర్ల పనులు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబుకు సీఆర్డిఏ తాళాలు సమర్పించనుంది.