News6th Oct 04:22 PMSunil Byrisetty1 min read
స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1)ను జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఎస్-5కు శంకుస్థాపన చేయడ
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1)ను జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఎస్-5కు శంకుస్థాపన చేయడంతో పాటు భారీ గోలియత్ క్రేన్, స్లిప్‌వే-4ను ప్రారంభించారు. కార్యక్రమంలో నేవీ చీఫ్ పాల్గొన్నారు. 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు భారత నావికాదళానికి అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. యుద్ధనౌకలకు నడిసంద్రంలోనే ఇంధనం అందించడంతో పాటు అవసరమైన ఇతర సహాయ సేవలను అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలు పారిశ్రామిక వృద్ధి, వ్యాపారం, పెట్టుబడులకు ఎంతో అనుకూలమైనవని పేర్కొన్నారు. సమన్వయంతో కూడిన మౌలిక సదుపాయాల అభివృద్ధితో, విశాఖ ఒక ప్రధాన నౌకాయాన, పారిశ్రామిక కేంద్రంగా బలోపేతం కానుందని తెలిపారు.