News5th Jan 11:38 AMSunil Byrisetty1 min read
డా. ఎన్టీఆర్ వైద్య సేవ నగదు రహిత వైద్య సేవల్లో భారీ పురోగతి
కూటమి ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు డా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో సానుకూలమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖా మంత్రి
కూటమి ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు డా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో సానుకూలమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వ పాలనలో భారీగా పెరిగిన వ్యయం మరియు లబ్దిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవల అమలును, 108, 104 సేవలను వర్చువల్ గా సమీక్షించారు. గత వైసిపి ప్రభుత్వం డా. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను 3,257కు పెంచి పూర్తి స్థాయిలో అమలు పరచిన 2022-23, 2023-24 కాలంలో ఫలితాలను, గత 19 నెలల కూటమి పాలనలో డా.ఎన్టీఆర్ వైద్య సేవ కింద సాధించిన ఫలితాలను మంత్రి విశ్లేషించారు. 2022-24 కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 23,08,930 మంది కింద లబ్దిపొందగా, కూటమి ప్రభుత్వ పాలనలో డా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతేడాది డిసెంబరు వరకు మొత్తం 24,49,117 లబ్దిదారులకు వైద్య సేవలందాయి. సగటున నెలకు 1,16,624 మందికి నగదు రహిత వైద్య సేవలు అందడంతో లబ్దిదారుల్లో 21 శాతం వృద్ధి నమోదైంది.