Politics26th Sep 12:01 PMSunil Byrisetty1 min read
జగన్ హయాంలో భారీ ప్రాజెక్టు.. కూటమిలో రద్దు
వైసీపీ హయాంలో కేటాయించిన భారీ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా కొమ్మూరులో ప్రతిపాదిత పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు మేఘా ఇ
వైసీపీ హయాంలో కేటాయించిన భారీ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా కొమ్మూరులో ప్రతిపాదిత పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఉన్నాయని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని మేఘా సంస్థ స్పష్టం చేసింది. పర్యావరణ, సాంకేతిక సవాళ్ల దృష్ట్యా తాము ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమంటూ మేఘా సంస్థ లిఖితపూర్వకంగా తెలియజేయడం వల్లే ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ, పర్యావరణ పరిరక్షణ, నిబంధనల దృష్ట్యా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. ఎన్నికలకు ముందు హడావుడిగా జగన్ ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసింది.