News7th Jun 10:31 AMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్‌ను కలిసిన మేజర్ రాంగోపాల్
దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జి
దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రాంగోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్‌గా పనిచేస్తుండగా.. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద దేశం కోసం ప్రాణాలకు తెగించి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు తోటి సైనికులను రక్షించారు. దీంతో మేజర్ రాంగోపాల్ నాయుడును ఈ ఏడాది మే 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారమైన కీర్తి చక్రతో సత్కరించారు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రాంగోపాల్ నాయుడు నిలిచారు. దేశం కోసం అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి కీర్తి చక్ర అవార్డు పొందిన రాంగోపాల్ నాయుడును లోకేష్ అభినందించారు.