Telangana20th Jan 05:07 PMSunil Byrisetty1 min read
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దన్న హైకోర్టు
ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ హైకోర్టు స్పందించింది. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది. బైక్ కీస్ లాక్కోవడ
ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ హైకోర్టు స్పందించింది. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది. బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్చందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్తో హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ ఆదేశాలు ఎంతమేరకు అమలవుతాయో చూడాల్సి ఉంది.