News30th Jan 11:28 AMSunil Byrisetty1 min read
ఏపీలో మహా పాపం.. సిట్ రిపోర్ట్ ఎఫెక్ట్!
కల్తీ నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ నిర్దారించింది. అయితే జంతువుల కొవ్వు కలపలేదన్న అంశం ఆధారంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని పలు దేవాలయాల ఎదుట నిరసనలకు దిగుతోంది. దీంతో టీడీపీ నేతల
కల్తీ నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ నిర్దారించింది. అయితే జంతువుల కొవ్వు కలపలేదన్న అంశం ఆధారంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని పలు దేవాలయాల ఎదుట నిరసనలకు దిగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఫ్లెక్సీ వార్ ప్రారంభించారు. లడ్డూ కల్తీని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి అంటూ ఈ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అది నెయ్యే కాదని, పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం అంటూ పోస్టర్లపై రాశారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ అని తెలిపారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారన్నారు. వైసీపీ పెద్దలు రూ.251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని ప్రస్తావించారు. ఈ ఫ్లెక్సీలపై జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోల్ని కూడా ముద్రించారు. విజయవాడలో అధికారికంగా టీడీపీ నేతలు ఈ పోస్టర్లు విడుదల చేశారు.