Politics4th Nov 10:01 AMSunil Byrisetty1 min read

డిపాజిట్ కోల్పోయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ!

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన పోటీ విషయంలో వెనుకంజ వేశారు. ఆయన చేసిన రాజకీయ ప్రయోగం బెజవాడ మేయర్ ఎన్నికల బరిలో ఘోరంగా విఫలమైంది. తనకున్న అధికారిక అనుభవం, వ్యక్తిగత గ

డిపాజిట్ కోల్పోయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ!
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన పోటీ విషయంలో వెనుకంజ వేశారు. ఆయన చేసిన రాజకీయ ప్రయోగం బెజవాడ మేయర్ ఎన్నికల బరిలో ఘోరంగా విఫలమైంది. తనకున్న అధికారిక అనుభవం, వ్యక్తిగత గుర్తింపు, రాజకీయ పార్టీల మద్దతు తనను విజయవంతమైన ప్రత్యామ్నాయంగా నిలబెడతాయని భావించిన ఆయనకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ కనీస స్థాయిలోనూ ప్రజల మద్దతు కూడగట్టుకోలేకపోయారు. మొత్తం 4,46,021 ఓట్లు పోలవగా, ఏబీవీకి కేవలం 12,642 ఓట్లు మాత్రమే లభించాయి. మరోవైపు కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ 2,65,888 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన కనీస ఓట్లను సాధించకపోవడంతో డిపాజిట్ కూడా కోల్పోయారు.
Scroll for the next article