News5th Jan 04:45 PMSunil Byrisetty1 min read
ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత తెలిపారు. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వైద్
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత తెలిపారు. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వైద్యసేవలందిస్తోందన్నారు. 108 వాహనాలు నిమిషాల వ్యవధిలోనే సేవలందిస్తున్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో108 వాహనాల పనితీరును కాగ్ కూడా తప్పుపట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త టెక్నాలజీ, శ్రద్ధతో వైద్యసేవలందిస్తోందని పేర్కొన్నారు. 104 ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి దాదాపు 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం కూటమి ప్రభుత్వం ఘనత అని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 300కు పైగా కొత్త అంబులెన్స్ లను వినియోగంలోకి తేవడం జరిగిందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.