News19th Jul 04:50 PMSunil Byrisetty1 min read

కలుషిత నీటితోనే గిరిపురంలో డయేరియా

విజయవాడ గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందడంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న కూడా పలువురు తీవ

కలుషిత నీటితోనే గిరిపురంలో డయేరియా
విజయవాడ గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందడంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న కూడా పలువురు తీవ్ర అస్వస్థతతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఉదంతాన్ని ప్రస్తావించారు. అధికారులు సరఫరా చేస్తున్న కలుషిత నీటి వల్లే గిరిపురం వీధుల్లో డయేరియా వేగంగా వ్యాపించిందని ఆరోపించారు. తాగే మంచినీరు రంగు మారి, దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా... అధికారులు మాత్రం అంతా బాగుందంటూ ప్రభుత్వానికి భజన చేయడంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. మంచినీరు అంతా బాగుంటే, ఇప్పుడు అత్యవసరంగా క్యాన్లలో ఎందుకు నీటిని సరఫరా చేయాల్సి వస్తోందని విష్ణు అధికారులను ప్రశ్నించారు. సమస్య ముదిరి, చేతులు కాలిన తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నగరంలో డ్రైన్లు శుభ్రం చేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లోపల ఉన్న ప్రధాన డ్రైన్‌ను సకాలంలో క్లీన్ చేయకపోవడం వల్లే, స్వల్ప వర్షానికే వర్షపు నీరంతా బందరు రోడ్డుపై నిలిచిపోతోందని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
Andhra Pradesh
Malladi Vishnu
Giripuram
Vijayawada
Diarrhoea
Contaminated Water
ప్రజారోగ్యం
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ
తెలుగు వార్తలు
Scroll for the next article