News27th Jul 10:06 AMSunil Byrisetty1 min read

డీఎస్సీ అక్రమాలపై 'సిబిఐ' విచారణ జరిపించాలి

మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎ

డీఎస్సీ అక్రమాలపై 'సిబిఐ' విచారణ జరిపించాలి
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ పోస్టర్‌ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, కేంద్రంలో నీట్ లీకేజీ వ్యవహారంపై విమర్శలు వచ్చినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మరి రాష్ట్రంలో డీఎస్సీలో ఇన్ని అక్రమాలు, అక్రమ ఎంపికలు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు? లోకేష్ రాజీనామా ఎప్పుడు చేస్తారు? అని నిలదీశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దందాలపై స్పష్టమైన ఆధారాలు బయటపెట్టినా ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
Andhra Pradesh
Education Department
YSRCP
Malladi Vishnu
DSC Recruitment
CBI Investigation
Nara Lokesh
Teacher Recruitment
విద్యార్థి ఉద్యమం
యువజన విభాగం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article