News29th Sep 03:42 PMSunil Byrisetty1 min read

ఆంధ్రాలో మల్లారెడ్డి పాగా!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ వ్యవస్థను నిర్మించి పాతుకుపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా వ్యాపారాన్ని విస్తరించేందుకు అడుగులు

ఆంధ్రాలో మల్లారెడ్డి పాగా!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ వ్యవస్థను నిర్మించి పాతుకుపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా వ్యాపారాన్ని విస్తరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఏపీలోని ప్రధాన నగరాలు, ఉమ్మడి జిల్లాలను లక్ష్యంగా చేసుకుని రీజినల్ క్యాంపస్‌లు, శాటిలైట్ క్యాంపస్‌లు , ఆఫ్‌-క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుకు మల్లా రెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం ప్రణాళికలను వేగవంతం చేసింది. విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఆఫ్-క్యాంపస్ పేరుతో ఇప్పటికే ప్రారంభించారు. యూజీసీ అనుమతులతో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ విభాగాల్లో అత్యాధునిక కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. విశాఖతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు బెల్ట్‌తో పాటు రాయలసీమ కేంద్రమైన తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ కొత్త క్యాంపస్‌ల నిర్మాణానికి భూముల సేకరణ, అనుమతుల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Scroll for the next article