News22nd Jun 01:21 PMSunil Byrisetty1 min read
జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి
వైసీపీ అధినేత జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించినట్లు లభించిన ఆధారాలు లభించాయి. సత్తెనపల్లి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల చేతికి వెంగళాయపాళెం వాసి సింగయ్య మృతి చెందిన విజు
వైసీపీ అధినేత జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించినట్లు లభించిన ఆధారాలు లభించాయి. సత్తెనపల్లి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల చేతికి వెంగళాయపాళెం వాసి సింగయ్య మృతి చెందిన విజువల్స్ అందాయి. టూర్ లో కారు ముందు భాగాన కుడి పక్క టైర్ కింద సింగయ్య
పడిపోయినట్లు తెలుస్తోంది. సింగయ్య మెడ మీదుగా కారు దూసుకెళ్లడంతో మరణించినట్లు చెబుతున్నారు. మనిషి పడినట్లు తెలిసినా అంతే వేగంతో కారు నడిపిన డ్రైవర్ కు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు బుక్ చేయాలని పోలీసుల నిర్ణయం తీసుకున్నారు.