Education24th Dec 02:52 PMSunil Byrisetty1 min read
విద్యా ప్రమాణాల మెరుగుకు "మన బడి - మన బాధ్యత"
పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవక
పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం తద్వారా పది పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా "మన బడి - మన బాధ్యత" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఆయా పాఠశాలల పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది, పది విద్యార్థుల్లో మానసిక ఆందోళన తగ్గించడం, చదువు పట్ల ఏకాగ్రత కలిగించడం, విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటిలో మంచి తర్ఫీదు ఇవ్వడం, అందులో ఉన్న భయం పోగొట్టడం ముఖ్యాంశాలు. అలాగే అదే సబ్జెక్టులో ఉన్నత విద్య అభ్యసించి అందులో నిపుణులుగా తయారు అయ్యే విధంగా మలచడం వంటి అంశాలు పట్ల దృష్టి సారించారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సిలింగ్ అందించడం చేస్తారు.