News27th Sep 05:48 PMSunil Byrisetty1 min read
కుంచనపల్లిలో మన ఇల్లు – మన లోకేష్
దశాబ్దాలుగా వారు అక్కడే నివసిస్తున్నారు. నానా కష్టాలు పడి ఇళ్లు నిర్మించుకున్నారు. సొంత ఇంట్లోనే ఉంటున్నా ఏదో తెలియని భయం. కష్టం వస్తే ఇల్లు అమ్మలేరు, ఎవరూ కొనరు. రుణం తీసుకుందామంట
దశాబ్దాలుగా వారు అక్కడే నివసిస్తున్నారు. నానా కష్టాలు పడి ఇళ్లు నిర్మించుకున్నారు. సొంత ఇంట్లోనే ఉంటున్నా ఏదో తెలియని భయం. కష్టం వస్తే ఇల్లు అమ్మలేరు, ఎవరూ కొనరు. రుణం తీసుకుందామంటే యాజమాన్య పత్రాలు లేని దుస్థితి. సొంతింటి కలసాకారమైనా హక్కులు లేక దిక్కులు చూస్తున్న మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు.. నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీ నేడు వరమైంది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, న్యాయపరమైన వివాదాలు పరిష్కరించి.. పేదలకు హక్కు కల్పించే ఒక మహా యజ్ఞం చేపట్టారు మంత్రి నారా లోకేష్. ఇప్పటివరకు వేలాదిమందికి వేల కోట్ల విలువైన ఆస్తి హక్కులు కల్పించిన కార్యక్రమం "మన ఇల్లు – మన లోకేష్". సోమవారం తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరగనుంది. మరో 372మందికి పట్టాలు అందజేయనున్నారు.