News31st Oct 04:08 PMSunil Byrisetty1 min read
మనమిత్ర ఆలోచన అద్భుతం
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఒక వినూత్న ఆలోచన, ఇప్పడు చదువురాని వారు కూడా వాట్సాప్ సులభంగా ఉపయోగిస్తున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దా
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఒక వినూత్న ఆలోచన, ఇప్పడు చదువురాని వారు కూడా వాట్సాప్ సులభంగా ఉపయోగిస్తున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ అన్నారు. తుపాన్ లాంటి విపత్తుల వేళ వాట్సాప్ ద్వారా ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు తెప్పించుకోవాలనే ఆలోచన అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ సమస్యలను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ నుంచి పరిష్కరించిన విధానం కూడా బాగుందని ప్రశంసించారు. ఇది చాలా మంచి చొరవ అని, దీన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించేలా సిఫారసు చేయమని కేంద్రానికి నివేదిస్తామన్నారు. అర్నబ్ తుపాన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ పరిశీలనా బృందం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించింది.