Film News13th Apr 03:04 PMSunil Byrisetty1 min read

ఏడ్చేసిన మంచు లక్ష్మి.. మనోజ్‌ను హత్తుకుని కన్నీళ్లు!

మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు ఎంతకీ కొలిక్కి రావడం లేదు. విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు.. మంచు మనోజ్ మరోవైపుగా వ్యవహారం మారింది. నిత్య

ఏడ్చేసిన మంచు లక్ష్మి.. మనోజ్‌ను హత్తుకుని కన్నీళ్లు!
మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు ఎంతకీ కొలిక్కి రావడం లేదు. విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు.. మంచు మనోజ్ మరోవైపుగా వ్యవహారం మారింది. నిత్యం గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు మెట్లెక్కడం వంటి అప్డేట్స్ మంచు కుటుంబంలో నిత్యకృత్యమయ్యాయి. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఎదురుపడ్డారు. చిన్న తమ్ముడ్ని చూడగానే లక్ష్మి వెక్కివెక్కి ఏడ్చారు. మనోజ్‌ను పట్టుకుని భావోద్వేగంతో కన్నీరుమున్నీయ్యారు. మనోజ్ భార్య మౌనిక ఆ అక్కాతమ్ముళ్లను ఓదార్చారు. లక్ష్మి జోక్యంతోనైనా వివాదానికి ముగింపు పడుతుందా అనేది చూడాలి.
manchu lakshmi
Tollywood
manchu manoj
Film News
మంచు మోహన్ బాబు
Scroll for the next article