News31st Aug 10:58 AMSunil Byrisetty1 min read
72 అడుగుల గణపతి సేవలో మనోజ్!
విజయవాడలో డూండీ గణేశ సేవా సమితి ఏర్పాటుచేసిన 72 అడుగుల గణనాథుని మట్టి విగ్రహాన్ని సినీ హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు. మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమను దర్శించుకోవడం ఎంతో సం
విజయవాడలో డూండీ గణేశ సేవా సమితి ఏర్పాటుచేసిన 72 అడుగుల గణనాథుని మట్టి విగ్రహాన్ని సినీ హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు.
మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మట్టితో 72 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం అభినందనీయమని చెప్పారు.
స్వామివారి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 12వ తేదీన కాను నటించిన మీరాయి చిత్రం విడుదల కానుందని వెల్లడించారు. మూడేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని, మీరాయి చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని మనోజ్ కోరారు.