Entertainment27th Jun 05:26 PMSunil Byrisetty1 min read
కన్నప్పకు మంచు మనోజ్ రివ్యూ!
మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరిన వేళ మంచు మనోజ్ తన అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమా చూసి స్పందించారు. ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్
మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరిన వేళ మంచు మనోజ్ తన అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమా చూసి స్పందించారు. ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ప్రభాస్ యాక్టింగ్ అదిరింది. అన్న కూడా ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా. మీ శ్రమకు తగిన ఫలితం దక్కాలని, పెట్టిన డబ్బు రెట్టింపుగా తిరిగి రావాలని కోరుకుంటున్నా’’ అని మనోజ్ తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు. తన తండ్రి మోహన్‌బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.