Entertainment25th Apr 01:25 PMSunil Byrisetty1 min read
ప్రభాస్‌దేముంది.. మామూలు నటుడేనన్న విష్ణు!
కన్నప్ప చిత్ర ప్రమోషన్లో భాగంగా నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటన సాధారణమేననంటూ వ్యాఖ్యానించారు. "నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. లె
కన్నప్ప చిత్ర ప్రమోషన్లో భాగంగా నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటన సాధారణమేననంటూ వ్యాఖ్యానించారు.
"నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుంది.
కానీ, మోహన్‌లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది.
రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను లెజెండ్‌ను చేస్తాయి’’ అని మంచు విష్ణు అన్నారు.
విష్ణు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
దీనిపై ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు విష్ణు స్థాయి ఏంటో తెలుసుకోవాలంటూ స్పందిస్తున్నారు.
కుటుంబం గురించి చెప్పుకోవడం మాని నటించడం నేర్చుకోమని సూచిస్తున్నారు.