Entertainment16th Jun 05:25 PMSunil Byrisetty1 min read
కన్నప్ప అద్భుతం.. విష్ణుకు తలైవా ప్రశంసలు!
'కన్నప్ప' చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. చిత్ర కథానాయకుడు మంచు విష్ణు 'ఎక్స్' ఖాతాలో చేసిన పోస్టులో రజినీ తన చిత్రాన్ని చూసి, అభినందించారని వెల్లడించారు. రజనీకాంత్
'కన్నప్ప' చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. చిత్ర కథానాయకుడు మంచు విష్ణు 'ఎక్స్' ఖాతాలో చేసిన పోస్టులో రజినీ తన చిత్రాన్ని చూసి, అభినందించారని వెల్లడించారు. రజనీకాంత్‌తో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. "రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి ‘కన్నప్ప’ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘కన్నప్ప’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నెల 27న మా సినిమా విడుదల కానుంది. ఆ పరమశివుడి లీలను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి కాజల్ అగర్వాల్, మోహన్ బాబు తదితర ప్రముఖులు నటించిన విషయం తెలిసిందే.