Politics17th Apr 03:41 PMSunil Byrisetty1 min read

సీఎస్‌ను కలిసిన మందకృష్ణ

ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్‌ని గౌరవ పూర్వకంగా కలిశార. వర్గీకరణ అమ

సీఎస్‌ను కలిసిన మందకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్‌ని గౌరవ పూర్వకంగా కలిశార. వర్గీకరణ అమలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఏపీ సిఎం పేషికి సంబంధించిన సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రన్, సిఎం సెక్రటరీ P.S ప్రద్యుమ్న, సీఎం అడిషనల్ సెక్రటరీ A.V రాజమౌళి కూడా కలిసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వారంతా ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు గాను మంద కృష్ణమాదిగ గారికి శుభాకాంక్షలు తెలిపారు
Andhra Pradesh
SC classification
CS
Padma Shri Manda Krishna Madiga
ఎస్సీ వర్గీకరణ
ఆంధ్రప్రదేశ్
సీఎం అడిషనల్ సెక్రటరీ A.V రాజమౌళి
Scroll for the next article