News6th Oct 12:36 PMSunil Byrisetty1 min read
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్
పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడ భవానీపురంలోని హరిత బెర
పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్ లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్ తో మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి ప్రజ్వలనతో పదవీ బాధ్యత ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైన్స్ అండ్ టెక్నాలజీ ఛైర్మన్ గా మందలపు రవికుమార్ ఎంపికను సమర్థిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ, అదే విధంగా సామాన్య ప్రజలకు చేరవేసి తద్వారా శాఖల అభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగస్వామ్యులు కావాలని మందలపు రవికుమార్ కు సూచించారు.