Spiritual29th Dec 03:58 PMSunil Byrisetty1 min read

ముక్కోటికి ముస్తాబైన మంగళాద్రి

మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటినుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీ సోమవారం ఏకాదశి రోజు తెల్

ముక్కోటికి ముస్తాబైన మంగళాద్రి
మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటినుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీ సోమవారం ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి శ్రీ స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయ మానంగా అలంకరించారు. ఏకాదశి ఒక్క రోజునే సుమారు 30వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1820వ సంవత్సరంలో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో భాగంగా మార్గమధ్యలోని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని బహుకరించారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున దక్షిణావృత శంఖంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు.
Andhra Pradesh
Mukkoti Ekadashi
Vaikuntha Ekadashi
Mangalagiri Temple
Sri Lakshmi Narasimha Swamy
Mangaladri
Religious Festival
భక్తుల దర్శనం
తీర్థ ప్రసాదం
దక్షిణావృత శంఖం
Scroll for the next article