Health13th Jun 11:28 AMSunil Byrisetty1 min read

25 లక్షల మందికి సేవలందించిన ఎయిమ్స్

మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం ఎంపీ, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. మంగళగిరి ఎయిమ్స్ ఆ

25 లక్షల మందికి సేవలందించిన ఎయిమ్స్
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం ఎంపీ, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ ఆసుపత్రిగా పేరుగాంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నందున ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ తరలివచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అదే స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
Andhra Pradesh news
Mangalagiri
Aiims hospital
25 LAKH OPD consultations
Vallabhaneni Balashowri
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు
ట్రామా సెంటర్ ఏర్పాటు
Scroll for the next article