TTD4th Jul 09:30 AMSunil Byrisetty1 min read
టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా మంగళగిరి వాసి అందె
టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా మంగళగిరికి చెందిన అందె వెంకటేశ్వరావును నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పేద చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన వెంకటే
టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా
మంగళగిరికి చెందిన అందె వెంకటేశ్వరావును నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పేద చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచి మగ్గం నేస్తూ ఉన్నత విద్యను అభ్యసించారు. కష్టపడి చదివి 1996లో గ్రూప్ -1 సాధించారు. స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్ జాయింట్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్నారు. ఆయనను ప్రభుత్వం టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందె వెంకటేశ్వరావును టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా నియమించడంపై గుంటూరు జిల్లా, మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.