News7th Sep 04:03 PMSunil Byrisetty1 min read

మంగళగిరి అభివృద్ధిలో మరో ముందడుగు

మంత్రి నారా లోకేష్ గారి చొరవతో తాడేపల్లి డోలాస్ నగర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నేడు తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు ఆధ్వర్యంలో నాయకులు శంకుస్థాపన చ

మంగళగిరి అభివృద్ధిలో మరో ముందడుగు
మంత్రి నారా లోకేష్ గారి చొరవతో తాడేపల్లి డోలాస్ నగర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నేడు తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు ఆధ్వర్యంలో నాయకులు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1.4 కోట్ల వ్యయంతో 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించనున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్నేహ ఫౌండేషన్ వారి రూ.కోటి సీఎస్‌ఆర్ నిధులతో పాటు, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ రూ.40 లక్షల నిధులను వినియోగించనున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. తాడేపల్లిలో ఇప్పటికే రెండు కమ్యూనిటీ భవనాలను ప్రారంభించుకున్నామని, మరో రెండు కమ్యూనిటీ హాళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
Andhra Pradesh
Mangalagiri Development
Nara Lokesh
Tadepalli
SC Community Hall
TDP
Vallabhaneni Venkata Rao
స్నేహ ఫౌండేషన్
సీఎస్ఆర్ నిధులు
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
Scroll for the next article