Sports4th Oct 05:32 PMSunil Byrisetty1 min read

ఆలిండియా మహిళా టి20కి మంగళగిరి అమ్మాయి

అక్టోబర్ 8 తేది నుంచి గ్వాలియర్లో జరిగే ఆల్ ఇండియా సీనియర్ మహిళ టి 20 టోర్నమెంట్ లో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ మహిళ క్రికెట్ ను ఏసిఏ టీం సెలక్షన్ లిస్ట్ ఏసిఏ సెక్రటరీ సానా సతీష్ ప్రకటి

ఆలిండియా మహిళా టి20కి మంగళగిరి అమ్మాయి
అక్టోబర్ 8 తేది నుంచి గ్వాలియర్లో జరిగే ఆల్ ఇండియా సీనియర్ మహిళ టి 20 టోర్నమెంట్ లో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ మహిళ క్రికెట్ ను ఏసిఏ టీం సెలక్షన్ లిస్ట్ ఏసిఏ సెక్రటరీ సానా సతీష్ ప్రకటించారు. టీం సెలక్షన్లో మంగళగిరికి చెందిన కడియం వాసవి అఖిల పావని ఎంపిక అయ్యారు. పావని 2024 లో కూడా అత్యంత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియాలో 15 వ స్థానం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మొదటి స్థానం,సౌత్ ఇండియా లో ద్వితీయ స్థానం సంపాదించింది. ఒకే సీజన్ లో 3 ఛాలెంజర్ ట్రోఫీలైన టి20 వన్డే,టెస్ట్ లలో స్థానం సంపాదించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డ్ సృష్టించింది. ఈ సంవత్సరం కూడా మంచి ప్రతిభ చూపి ఉమెన్స్ ఐపీల్ కి సెలక్ట్ అవ్వాలని కోరుకుంటూ వాసవి అఖిల పావనికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh
Mangalagiri
Women’s Cricket
ACA
All India T20
Kadium Vasavi Akhila Pavani
Gwalior Tournament
Women’s IPL
Sports News
Cricket Selection
కడియం వాసవి అఖిల పావని
గ్వాలియర్ టోర్నమెంట్
ఉమెన్స్ ఐపీఎల్
Scroll for the next article