News5th Apr 11:31 AMSunil Byrisetty1 min read

అఘోరీ చెర నుంచి విడుదల.. గుజరాత్‌లో శ్రీవర్షిణి

మంగళగిరి యువతి శ్రీవర్షిణి కథ సుఖాంతమైంది. వివాదాస్పద మహిళా అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ

అఘోరీ చెర నుంచి విడుదల.. గుజరాత్‌లో శ్రీవర్షిణి
మంగళగిరి యువతి శ్రీవర్షిణి కథ సుఖాంతమైంది. వివాదాస్పద మహిళా అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్‌లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ వెళ్లి ఆమెను విడిపించారు. యువతి శ్రీవర్షిణిని మంగళగిరికి తీసుకురానున్నారు.
Srivarshini
Mangalagiri
Aghori
శ్రీవర్షిణి
గుజరాత్
Scroll for the next article