News5th Apr 09:14 AMSunil Byrisetty1 min read
పాతికేళ్ల కల.. లోకేష్ నెరవేర్చాడిలా..!
’ఇంటి పట్టా కోసం పాతికేళ్లుగా కలగంటున్నాం. ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం. 25 సంవత్సరాలుగా మా పట్టా మాది అనుకోవడమే కానీ చేతికందలేదు. మంత్రి లోకేష్ మా కల నెరవేర్చారు. ఇంత త్వరగ
’ఇంటి పట్టా కోసం పాతికేళ్లుగా కలగంటున్నాం. ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం. 25 సంవత్సరాలుగా మా పట్టా మాది అనుకోవడమే కానీ చేతికందలేదు.
మంత్రి లోకేష్ మా కల నెరవేర్చారు. ఇంత త్వరగా ఇచ్చేస్తారనుకోలేదు. మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన సమయమిదే.
లోకేష్ స్వయంగా వచ్చి మా చేతికందించడం మాకు పునర్జన్మ లాంటిది. పట్టాలు అడిగితే మమ్మల్ని బెదిరించారు.
ఇల్లు వేసుకున్నప్పుడు కూడా ఫారెస్ట్, ఇండస్ట్రీ ఇలా నాలుగైదు సార్లు పడేసినా, కష్టపడి నిలబెట్టుకున్నాం
తాత్కాలికం అనుకున్నవి శాశ్వతం చేసిన లోకేష్ కి ధన్యవాదాలు.
మాకే కాదు మా పిల్లలు, భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిని ఏర్పాటు చేసిన లోకేష్ రుణం తీర్చుకోలేనిది.‘ 25 సంవత్సరాల కల మా లోకేష్ బాబు చొరవతో కేవలం 10 నెలల్లోనే నెరవేరింది. పట్టువస్త్రాలు పెట్టి మరీ ఇంటి పట్టా ఇచ్చారని మంగళగిరిలో పట్టాలు అందుకున్న మహిళలు భావోద్వేగంతో తమ హర్షం వ్యక్తం చేశారు