News14th Aug 02:06 PMSunil Byrisetty1 min read
మంగళగిరి.. సీరియస్గా ఆలోచించాల్సిందే!.
మంగళగిరి ఎంటీఎంసీ.. పేరుకే నగరం.వర్షం కురిస్తే నివాస ప్రాంతాలు, రహదారులు డ్రైనేజీ వ్యవస్థ లేక చెరువులను తలపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు పడరాని పాట్లుపడుతున్నారు. ఇకనైనా విచ్చల విడిగ
మంగళగిరి ఎంటీఎంసీ.. పేరుకే నగరం.వర్షం కురిస్తే నివాస ప్రాంతాలు, రహదారులు డ్రైనేజీ వ్యవస్థ లేక చెరువులను తలపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు పడరాని పాట్లుపడుతున్నారు. ఇకనైనా విచ్చల విడిగా పెరిగిన ఆక్రమణ పై దృష్టి సారించి కబ్జాదారులపై నిర్మోహమాటంగా చర్యలకు సిద్ధం కావాలి. ఇలాంటి సమస్య ఒకసారితో పోయేది కాదన్న సత్యాన్ని పాలకులు, అధికారులు సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ముంచుకొచ్చింది. భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుంటే ఆక్రమణల తొలగింపుకు తెలంగాణాలో అమలు చేస్తున్న హైడ్రా తరహ వ్యవస్థ ఇక్కడా అవసరమేననిపిస్తోంది. ప్రభుత్వ విభాగాలు చాలా వరకు ఈ నగరంలోనే వున్నందున ఆక్రమణలు,నీటి పారుదల డ్రైనేజీ ల గురించి ప్రత్యేక శ్రద్థ చూపాల్సిన అవసరం ఎంతైనా వుంది.