News18th Jan 02:35 PMSunil Byrisetty1 min read

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్

మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 మ్యాచ్‌లు గత 28 రోజులుగా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. క్రికెట్ పోటీలను తిలకించేందుకు పర్చూరు ఎమ్

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్
మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 మ్యాచ్‌లు గత 28 రోజులుగా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. క్రికెట్ పోటీలను తిలకించేందుకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గిద్దలూరి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విచ్చేశారు. కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నెల రోజుల పాటు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్రికెట్ పోటీలను అన్ని ఏర్పాట్లతో ఉత్సాహంగా నిర్వహిస్తుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుయని చెప్పారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి మంగళగిరి నియోజకవర్గానికి పేరు తేవాలని ఎమ్మెల్యేలు క్రీడాకారులను కోరారు.
Andhra Pradesh
Mangalagiri Premier League
MPL Season 4
Cricket Tournament
Nara Lokesh Birthday Celebrations
Youth Sports
Cricket Enthusiasm
Eluri Sambasiva Rao
Scroll for the next article