News17th Jul 03:27 PMSunil Byrisetty1 min read
ముస్తాబైన మంగళగిరి రైల్వే స్టేషన్
మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే, గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను రూ.12.56 కోట్లతో ఆధున
మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే, గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను రూ.12.56 కోట్లతో ఆధునికీకరణ పూర్తి చేశారు. ఈ స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎం ఎస్ జి -4 కేటగిరి కి చెందిన ఈ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించారు. సరికొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్ వంటి సదుపాయాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌తో తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు, స్పష్టమైన సైనేజీ బోర్డులతో స్టేషన్ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది.
ప్రయాణికులందరికీ ప్రయాణం సులభతరం చేసేలా ప్లాట్‌ఫారమ్ 1, 4 లపై కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రెండు లిఫ్టులు, ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు ప్రత్యేక శౌచాలయాలను నిర్మించారు. విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ప్రత్యేక ట్రాక్‌లు, రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను ఏర్పాటు చేశారు.