News29th Nov 04:15 PMSunil Byrisetty1 min read
వైద్యవిద్యలో మంగళగిరి విద్యార్థి ప్రతిభ
డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్టుగ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి, సాయి నగర్‌కు చెందిన పాపన జితేంద్ర రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచాడు. పాపన శ
డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్టుగ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి, సాయి నగర్‌కు చెందిన పాపన జితేంద్ర రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచాడు. పాపన శివరామ్ ప్రసాద్, ధనలక్ష్మిల కుమారుడు జితేంద్ర ఆర్థోపెడిక్ విభాగంలో 800 మార్కులకు 568 మార్కులు సాధించి రాష్ట్రంలో నెంబర్ ఒన్ గా నిలిచాడు. జితేంద్ర ఏలూరు జిల్లా ఆశ్రమ వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు. కళాశాల ప్రిన్సిపాల్ చేబ్రోలు శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ఫ్రోఫెసర్ డాక్టర్. ఆర్.ఎం. మల్లిఖార్జున రెడ్డి విద్యార్థి జితేంద్రను అభినందించారు. తండ్రి బంగారపు పని చేసుకుంటూ తన కుమారుడిని చదివించారు. ఈ సందర్భంగా పీజీలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం తమకు గర్వకారణంగా ఉందని తండ్రి శివరామ్ ప్రసాద్ తెలిపారు.