News26th Aug 03:31 PMSunil Byrisetty1 min read

మంగళగిరిలో అన్ని హంగులతో మోడల్ రైతు బజార్

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆధునిక హంగులతో చ

మంగళగిరిలో అన్ని హంగులతో మోడల్ రైతు బజార్
మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆధునిక హంగులతో చేపట్టే రిటైల్ అండ్ హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. మోడల్ రైతు బజార్ ను 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్ల అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా, వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ రిటైల్, హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులుగా ఉండనుంది. రిటైల్ మార్కెట్ లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60 షాపులు ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా హోల్ సేల్ మార్కెట్ లో అన్ లోడింగ్ ప్లాట్ ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. 61.4 చ.మీల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, 144.6 చ.మీ విస్తీర్ణంలో అడ్మిన్, మెయింటెనెన్స్ ఏరియాస్, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, ప్రజల కోసం 130 చ.మీల విస్తీర్ణంలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకులు తరలించే వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుచేయనున్నారు.
Andhra Pradesh
Mangalagiri
Nara Lokesh
Model Rythu Bazaar
Rythu Bazaar
Andhra Pradesh
Vegetable Market
Retail Market
Wholesale Market
Farmers
అరబిందో ఫార్మా ట్రస్ట్
సీఎస్ఆర్ నిధులు
మంగళగిరి అభివృద్ధి
ఆధునిక మౌలిక వసతులు
రైతుల సంక్షేమం
Scroll for the next article